ప్రపంచ శాంతికి ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి కృషి చేయాలి: ప్రధాని మోదీ పిలుపు
- అంతర్జాతీయ సంస్థలకు ప్రధాని మోదీ సూచన
- పశ్చిమాసియా, ఉక్రెయిన్లలో సుస్థిర, సుదీర్ఘ శాంతి కొనసాగాలన్న మోదీ
- ఆస్ట్రియా ఛాన్సెలర్తో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్న మోదీ
అంతర్జాతీయ సంస్థలు ప్రపంచశాంతికి ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్లలో సుస్థిర, సుదీర్ఘ శాంతి కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆస్ట్రియా ఛాన్సెలర్ క్రిస్టియన్ స్టాకర్తో కలిసి ప్రధాని మోదీ ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యుద్ధ క్షేత్రాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కొన్ని దేశాల యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ యుద్ధం ప్రభావం ప్రజల జీవన విధానంపై పడుతోందని అన్నారు. ఉక్రెయిన్ లేదా పశ్చిమాసియా ఏదైనా సమస్య శాశ్వతంగా పరిష్కారమై, శాంతి, సుస్థిరత కావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. సవాళ్లను ఎదుర్కోవడానికి సరికొత్త సంస్కరణలు చేపట్టవలసి ఉందని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను తుదముట్టించడం కూడా అవసరమని అన్నారు.
ఆస్ట్రియా ఛాన్సెలర్ రాకతో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత భారత్లో వాణిజ్య పెట్టుబడుల రంగంలో నూతనోత్సాహం మొదలైందని అన్నారు. భారత్-ఈయూ మధ్య కొత్త ఒప్పందాలతో సువర్ణాధ్యాయం ప్రారంభం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.